పొరుగు రాష్ట్ర రాజకీయాలతో మాకు సంబంధం లేదన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. కానీ.. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా మేము విమర్శిస్తామన్నారు. రాజ్యాంగ బద్దంగా పరిపాలన జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎక్కడ జరిగినా అది కరెక్ట్ కాదన్నారు. బాధితులకు మా సానుభూతి ఉంటుందన్నారు. ఇక వివేకానందరెడ్డి మా నాయకుడని.. ఆయన హత్య కేసులో దోషులు ఎవరో తేల్చాల్సిందేనన్నారు.
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తుందన్నారు. ఒకే ప్రాంతంలో రాజధాని నిర్మాణం కరెక్ట్ కాదని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను శిరసావహించాల్సిన బాధ్యత ఉందన్నారు మంత్రి ఆదిమూలపు. జనసేన పార్టీ భావజాలం ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలియాలన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే అజెండా అనడం విడ్డూరంగా ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయాడని ఏద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 175 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.