రైల్వే ప్రయాణికులకు శుభవార్త…జన్మభూమి రైళ్ల పునరుద్ధరణ

-

విజయవాడ డివిజన్‌లో ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది.జన్మభూమి, విజయవాడ- కాకినాడ పోర్ట్‌ రైళ్లను ప్రయాణికులకు మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది.

నిడదవోలు-కడియం మధ్య ఆధునికీకరణ పనుల కారణంగా జూన్‌ 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు రైళ్లను ఇటీవల రద్దు చేశారు. జన్మభూమి, రత్నాచల్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు రద్దు చేయడంతో ప్రయాణికుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. ఈ క్రమంలో విశాఖ- లింగంపల్లి (12805) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను జూన్‌ 25 నుంచి యథావిధిగా నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో పాటు విజయవాడ- కాకినాడ పోర్టు (17257); చెంగల్పట్టు- కాకినాడ పోర్ట్‌ (17643) మధ్య నడిచే రైళ్లను పునరుద్ధరించినట్లు తెలిపింది. వీటితో పాటు రద్దీని తగ్గించేందుకు తీసుకొచ్చిన పలు ప్రత్యేక రైళ్లను మరింత కాలం పాటు నడపునున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది

.

Read more RELATED
Recommended to you

Latest news