తాము అధికారంలోకి వచ్చాక కూడా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.కొవ్వూరు ప్రజాగళం సభలో మాట్లాడిన ఆయన.. ‘వాలంటీర్ల వ్యవస్థకు నేను వ్యతిరేకం కాదు. వారంతా వైసీపీకి పని చేయడం సరికాదు అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలని వాలంటీర్లను కోరుతున్నా. ఎండలో సచివాలయానికి వెళ్లడం వల్ల ఒకరిద్దరు చనిపోయారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు ఇచ్చే వీలుంది. కానీ జగన్ కావాలనే అలా చేయించలేదు’ అని చంద్రబాబు ఆరోపించారు.
విధ్వంస పాలకుడిగా రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని, ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉందని ఆరోపించారు. రక్తంలో మునిగిన వైసీపీకి ఓట్లు వేయొద్దని స్వయంగా జగన్ చెల్లే కోరుతున్నారని అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికే మిత్రపక్షాలతో కూటమిగా వచ్చామని చంద్రబాబు వెల్లడించారు.