వామ్మో… ఆ టీడీపీ అభ్యర్థి ఇలాంటి వాడా…!

-

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనేది అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ లక్ష్యం. ఇప్పటికే రెండు పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. వైసీపీ అధినేత ముందు నుంచి చెబుతున్నట్లుగానే సుమారు 50 మంది కొత్త వారికి టికెట్లు ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం దాదాపు పాతవారికే టికెట్లు ఇచ్చింది. అదే సమయంలో టీడీపీకి సరైన నాయకత్వం లేని నియోజకవర్గంలో చివరి నిమిషంలో పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. ఇవే ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అడుగు ముందుకు వేసే చంద్రబాబు.. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఎన్నో సర్వేలు నిర్వహించామంటున్నారు. మరి అలాంటి చంద్రబాబు మదనపల్లె నియోజకవర్గం అభ్యర్థి విషయంలో మాత్రం ఇలాంటి వ్యక్తికి ఎలా టికెట్ ఇచ్చారనే మాట వినిపిస్తోంది.

2009 నుంచి మదనపల్లె నియోజకవర్గంలో టీడీపీ గెలవలేదు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో… 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన గెలిచిన షాజహాన్ బాషాకు ప్రస్తుత ఎన్నికల్లో చంద్రబాబు టికెట్ కేటాయించారు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. షాజహాన్ బాషాపై పలు రకాల అవినీతి ఆరోపణలున్నాయి. అదే సమయంలో బాషా వ్యవహార శైలి అంటున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ఖి రుజువులతో సహా బయటపెట్టారు. షాజహాన్ బాషాను మదనపల్లె మన్మధుడు అనేస్తున్నారు. సాయం కోసం వచ్చిన వారిని ట్రాప్ చేయడమే బాషా లక్ష్యమంటున్నారు. ఇంకా చెప్పాలంటే… పక్కవారి పెళ్లాంపై కన్నేసి బెంగళూరులో కాపురం పెడతారని షాజహాన్ బాషాపై ఘాటు వ్యాఖ్యలే చేస్తున్నారు.

ఇవన్నీ ఆరోపణలే కాదు… నిజాలు కూడా. కుటుంబ తగదాలతో బాషా దగ్గరకు వచ్చిన ఓ హోమ్ గార్డు కుటుంబానికి తీరని అన్యాయం చేశారు. భార్యభర్తల గొడవలో వేలు పెట్టిన బాషా… హోమ్ గార్డు భార్యతో ఫోన్‌లో చాటింగ్ చేసి ఆమెను లొంగదీసుకున్నారు. ఆ తర్వాత ఆమెతో బెంగళూరులో కాపురం పెట్టారు. తగవు తీర్చి సాయం చేయమని వచ్చిన హోమ్‌గార్డును తన్ని తరిమేశారు. చివరికి అతనికి భార్యతో విడాకులు ఇప్పించారు కూడా. ఇలా ఒకటి కాదు రెండు కాదు… ఇలాంటి కేసులు దాదాపు ఐదు వరకు ఉన్నాయి. ఇవన్నీ రుజువులతో సహా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. హోమ్ గార్డు భార్యతో బాషా జరిగిన వాట్సప్ చాటింగ్ స్ర్కీన్ షాట్లతో సహా బయట పెట్టారు వైసీపీ నేతలు. ఇలాంటి వారికా టీడీపీ టికెట్ అని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో తక్షణమే షాజహాన్ బాషాను మార్చాలని టీడీపీ నేతలే అధినేతను వేడుకుంటున్నారు. నాలుగు రోజుల క్రితం ప్రజాగళం కొసం వచ్చిన చంద్రబాబు దగ్గర ఇదే విషయాన్ని ఏకరువు పెట్టారు. తాజాగా మంగళగిరి పార్టీ కార్యాలయానికి కూడా ఇదే అంశంపై లేఖలు రాస్తున్నారు. బాషాను మారిస్తేనే టీడీపీ గెలుస్తుందని… లేదంటే ఓటమి ఖాయమంటున్నారు టీడీపీ నేతలు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news