ఇచ్చిన హామీలు అన్నీ తూచ తప్పకుండా అమలు చేస్తాం : ఈటల రాజేందర్

-

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడుతూ… రేవంత్ పాడిందే పాడరా అన్నట్టు మాట్లాడుతున్నారని ,పదేళ్ల క్రితం మోదీ వస్తె దేశం విచ్ఛిన్నం అవుతుంది అని ఏదైతే మాట్లాడారో ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు మోదీ పదేళ్ల పాలననే సమాధానం అని ఈటెల రాజేందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీ గారి సారధ్యంలో హింసలేదు. బాంబుల మోతలు లేవు. దేశ ప్రతిష్ట పెరిగింది అని అన్నారు.దేశమంతా మోడీ మోడీ అంటుంటే…రేవంత్ ఊరంతా ఒకదారి అయితే ఊసరవెల్లిది ఒకదారి అన్నట్టు,ఖయాల్ తప్పి మాట్లాడుతున్నారు అని విమర్శించారు.

ఇక్కడ ప్రభుత్వం ఉండగా, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టగా,ఇన్ని హామీలు ఇవ్వగా ఒడిపోతున్నామనే ఫ్రస్టేషన్ లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అతితక్కువ కాలంలోనే ప్రజల దృష్టిలో పలచన అయిన సీఎం, రేవంత్ రెడ్డి అని ఎద్దేవ చేశారు. పదేళ్ల తరువాత ప్రభుత్వ పాలనమీద వ్యతిరేకత ఉంటుంది కానీ మోదీ గారికి పాజిటివ్ ఓటు పడింది. అమిత్ షా గారు తెలంగాణ లో మొదటి మీటింగులో చెప్పినట్టు 12 సీట్లు గెలవబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంతో సహా అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. సర్వే సంస్థలకు అందని ఫలితాలు రాబోతున్నాయి. తెలియని నిషబ్ద విప్లవం నాలుగవ తారీఖు ఆవిష్కరించబోతుంది. తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ఇచ్చిన హామీలు అన్నీ తుచ తప్పకుండా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. బీజేపీకి మద్దతు తెలిపిన యావత్ తెలంగాణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news