చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం : చంద్రబాబు

-

ఉద్యోగులు, పింఛనర్లకు ఒకటో తేదీనే జీతాలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేస్తామని అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ ఇస్తామని, ఆశావర్కర్లకు కనీస వేతనం పెంపునకు చర్యలు తీసుకుంటామన్నారు.చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ చేస్తాం అని ఆయన తెలిపారు.

ఎస్సీ, ఎస్టీల బ్యాక్‌లాగ్‌ పోస్టులు భర్తీ చేస్తాం. బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందజేస్తాం.పశువుల కొనుగోలు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, గోకులాల ఏర్పాటు, మేత కోసం బంజరు భూముల కేటాయిస్తాం. ‘గోపాలమిత్ర’ పునర్నియామకం దిశగా చర్యలు చేపడతాం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news