IPL 2024 :ముంబై బ్యాటర్ల విఫలం.. లక్నోకి స్వల్ప టార్గెట్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఈరోజు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్లో  లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.

రోహిత్ శర్మ పుట్టినరోజు నాడు స్పెషల్ ఇన్నింగ్స్ చూద్దామనుకున్న అభిమానులకు నిరాశ ఎదురైంది. ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ పై 4 పరుగులకే వెనుదిరిగారు.పవర్ ప్లే ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 4 కీలక వికెట్లు కోల్పోయి 28 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ (10), తిలక్ వర్మ (7), హార్దిక్ పాండ్య (0) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత ఓపెనర్ ఇషాన్ కిషన్ (32 పరుగులు), నేహాల్ వధేరా 41 బంతుల్లో 46 పరుగులు ,టిమ్ డేవిడ్ 35 రాణించారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మోసిన్ ఖాన్ 2, స్టోయినిస్, నవీన్ ఉల్ హక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news