పెళ్లికి లెహంగాలు వేసుకోవడం బంద్‌.. రాత్రి 12 దాటాక జనం గుమిగూడితో ఫైన్‌

-

నిర్ణయాలు సంచలనం అయినప్పుడే అవి వైరల్‌ అవుతాయి.. అవి ఎలా ఉంటాయంటే.. అరే ఇలా కూడా నిర్ణయిస్తారా అనేలా.. పెళ్లంటే.. ఈరోజుల్లో అమ్మాయిలు పెద్ద పెద్ద లెహంగాలు వేసుకుంటున్నారు.. చక్కగా బుట్టబొమ్మలా ఉంటారు.. అలా వేసుకోవద్దట.. వధువులు లెహంగాలు ధరించేందుకు వీల్లేదు అక్కడ.. హరియాణా, పంజాబ్‌లలోని గ్రామ పంచాయతీలు తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సంచలనమవుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అలాంటి వార్తే ఒకటి వెలుగులోకి వచ్చింది. కపుర్తలా జిల్లాలోని భదాస్ గ్రామంలో పంచాయతీ ఇచ్చిన తీర్పు ఏంటంటే.. అక్కడి గ్రామ పంచాయతీ ఓ డిక్రీ జారీ చేసింది.
పెళ్లి తంతులో హోమ గుండం చుట్టూ ఏడు అడుగులు వేసే సమయంలో వధువులు లెహంగా ధరించేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. రాత్రి 12 దాటాక పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఇలాంటి తంతులు నిర్వహిస్తే రూ.11 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించింది… కేవలం కుటుంబ సభ్యుల మధ్యే వివాహం జరగాలని, ఎక్కువ మందిని పిలిచేందుకూ అనుమతి లేదని తేల్చి చెప్పింది. ఈ రూల్స్‌ను అతిక్రమించేందుకు వీల్లేదని కచ్చితంగా చెప్పింది. ఇంతకీ ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుందంటే.. ఖర్చులు తగ్గించుకోడానికి. అవును. ద్రవ్యోల్బణం పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇలాంటి వేడుకలకు భారీగా ఖర్చు చేయడం సరి కాదని వెల్లడించింది. అందుకే సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని గ్రామస్థులకు సూచిస్తోంది. అనవసరమైన వాటి కోసం ఎక్కువగా ఖర్చు పెట్టి అప్పులపాలు కావద్దని హితవుపలికింది.

పెళ్లి మండపంలో ముద్దుపెట్టాడని పెళ్లి కాన్సిల్‌ చేసిన వధువు..

యూపీలో ఓ వధువు ఉన్నట్టుండి పెళ్లి క్యాన్సిల్ చేసేసింది. వరుడిపై కోపంతో వేదిక దిగి వెళ్లిపోయింది. పైగా పోలీసులకు ఫోన్ చేసి కేసు కూడా వేసింది.. ఇంతకీ వధువు అలా ఎందుకు చేసిందో తెలుసా.. వరుడు చేసిన ఓ చిలిపి పనికి మండి… 300 మంది అతిథుల ముందు స్టేజ్‌పైనే వధువుకి ముద్దు పెట్టాడు వరుడు. దీన్ని అవమానంగా భావించిన యువతి వెంటనే వేదిక దిగి కోపంగా వెళ్లిపోయింది. ఓర్నీ ఈరోజుల్లో ఇది చాలా కామన్‌విషయం అయిపోయిందిగా అనుకుంటున్నారా.. కానీ ఆమెకు నచ్చలేదేమో.. పోలీసులకు ఫోన్ చేసి ఇదంతా చెప్పింది. అయితే ట్విస్ట్‌ ఏంటంటే.. వధువుకి కోపం వచ్చింది వరుడు ముద్దు పెట్టినందుకు కాదు. అలా వేదికపైనే అందరూ చూస్తుండగానే ముద్దు పెడతానని వరుడు వాళ్ల ఫ్రెండ్స్‌తో బెట్ కాశాడట. దీంతో ఆమెకు కోపం వచ్చింది.. అబ్బాయి క్యారెక్టర్‌ నాకు నచ్చలేదు అని తేల్చి చెప్పింది. పోలీసులు, ఇంట్లోవాళ్లు ఎంత సర్ధిచెప్పినా ఆమె వినలేదు.. వరుడు తన ఆత్మగౌరవానికి భంగం కలిగించాడు, అంత మంది ముందు అసభ్యంగా తాకాడని పెళ్లికి ససేమిరా అనింది.. దీంతో పెళ్లి కాస్తా రద్దయింది.. చిన్నముద్దు కొంపముంచేసింది..!

Read more RELATED
Recommended to you

Latest news