ఉద్యోగులకు తీపి కబురు..వచ్చే ఆర్థిక సంవత్సరంలో వారానికి మూడు వీక్ ఆఫ్ లు..!

-

2022-2023 ఆర్థిక సంవత్సరం నుండి కేంద్రం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లు అమలు కానున్నాయి. కాగా ఇప్పుడు అమలులో ఉన్న వారానికి ఆరు లేదా ఐదు రోజుల పనిందినాలను రాబోయే ఆర్థిక సంవత్సరం లో కుదించే అవకాశాలు ఉన్నాయి. పనిదినాలని కుదించి మిగతా రోజుల్లో పని చేసే సమయం పెంచే అవకాశం ఉంది. పని దినాలను కుదించినప్పటికీ వారానికి 48 గంటలు ఖచ్చితంగా పని చేయాల్సిందే. దాంతో వారానికి నాలుగు రోజులు పని దినాలు ఉంటే రోజుకు 12 గంటలు పని చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఉద్యోగుల మూల వేతనం కూడా 50 శాతానికి తగ్గకుండా మిగతాది భత్యాల రూపంలో చెళ్ళించనున్నారు.

అయితే ఈ నిర్ణయం తో ఇంటికి తీసుకువెళ్ళే జీతం తగ్గనుండగా కట్ అయ్యే పీఎఫ్ పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కేంద్రం తీసుకువచ్చిన ఈ నిర్ణయం పై వ్యతిరేకత ఎదురవుతోంది. రోజుకు 12 గంటలు పని చేయడం అనేది కష్టమైన విషయం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పని లో నాణ్యత కూడా తగ్గే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే జీతాలు తక్కువ వస్తుండగా తాజాగా చేసిన నిర్ణయం తో టేక్ హోమ్ వేతనం తగ్గి మరింత కష్టం గా మారే అవకాశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. మరి మీరు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమర్థిస్తారా…?

Read more RELATED
Recommended to you

Latest news