పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రానికి షాక్ ఇచ్చారు. సోమవారం రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను విడుదల చేసే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసారు. ఏకపక్ష ఉత్తర్వు వల్ల తాను షాక్ అయ్యానని, ఆశ్చర్యపోయానని అన్నారు. బెంగాల్ ప్రధాన కార్యదర్శి అలపన్ బండియోపాధ్యాయ్ ఢిల్లీలో నివేదించాలని కేంద్రం ఆదేశించింది.
ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 1987 కేడర్ ఐఎఎస్ అధికారి అలపాన్ బండియోపాధ్యాయ మే 31 ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఇది రాజ్యాంగ విరుద్దమని ఆమె అన్నారు. కరోనా సహా తుఫాన్ తో రాష్ట్రం చాలా నష్టపోయిందని కాబట్టి ఈ తరుణంలో తాము రిలీజ్ చేయడం కష్టమని అన్నారు.