‘రాజకీయాలను మించిన పెద్ద విషయాలే మాట్లాడాం’.. స్టాలిన్‌తో దీదీ భేటీ

-

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమిళనాడులో పర్యటించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలు పాటు వీరు సమావేశం అయ్యారు. శుభకార్యానికి హాజరయ్యేందుకు తమిళనాడుకు వచ్చానని, అందులో భాగంగానే తనకు సోదర సమానుడైన స్టాలిన్‌తో భేటీ అయ్యానని చెప్పారు. తమ భేటీలో రాజకీయాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదని మమత క్లారిటీ ఇచ్చారు.

‘‘స్టాలిన్‌ నా సోదరుడు లాంటి వారు. ఇక్కడో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చా. అందులో భాగంగానే స్టాలిన్‌ను కలిశా. అయినా ఇద్దరు రాజకీయ నేతలు కలిసినప్పుడు రాజకీయాలే కాదు.. ఇతర విషయాలు కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే రాజకీయాలను మించిన పెద్ద విషయాలే మాట్లాడుకున్నాం’’ అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు మమత సమాధానం ఇచ్చారు.

ఈ భేటీపై స్టాలిన్‌ కూడా స్పందించారు. మర్యాదపూర్వకంగానే మమత భేటీ అయ్యారని తెలిపారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదని, కోల్‌కతాకు మమత తనను ఆహ్వానించారని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయన్న క్రమంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అలాంటిదేమీ లేదని నేతలిద్దరూ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news