ఆమె లేకపోతే బిగ్ బాస్ చూడటం వెస్ట్..!

బిగ్ బాస్ షోకి ఎంతో ప్రజాదరణ పెరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ, ఎలిమినేషన్ అయ్యేదెవరు వంటి కీలకమైన అంశాల్ని లీకు చేస్తూ బిగ్ బాస్ 4 పై ప్రేక్షకుల్లో ఆసక్తిని సన్నగిల్లేలా చేస్తున్న వారికి ఆ షో టీమ్ షాక్ ఇవ్వాలని అనుకున్నట్టు తెలుస్తుంది. అందరూ అనుకున్నట్టు ఈ వారం వెళ్తాడనుకున్న మెహ‌బూబ్ సేఫ్ జోన్‌లో అడుగు పెట్ట‌గా, దేవి నాగ‌వ‌ల్లి ఎలిమినేట్ అయింది.

దేవి నాగ‌వ‌ల్లి, మెహ‌బూబ్‌కు మ‌ధ్య స్వ‌ల్ప ఓట్ల తేడా మాత్ర‌మే ఉంద‌ట‌. మరి ఎవరికి తక్కువ ఓట్లు వచ్చాయో “నిజానికి” తెలియదు. ఇదంతా లీకువీరుల ఆట క‌ట్టించ‌డానికి బిగ్‌బాస్ వేసిన ఎత్తుగ‌డ‌లా క‌నిపిస్తోందని వినికిడి. ఈ వార్త విని దేవి అభిమానులు బిగ్‌బాస్ యాజ‌మాన్యంపై తీవ్ర‌ స్థాయిలో ఆగ్ర‌ హం వ్య‌ క్తం చేస్తున్నారు. దేవి ఎలిమినేట్ అయితే ఈ సీజ‌న్ ఇంక ఎందుకూ ప‌నికిరాద‌ని తిట్టిపోస్తున్నారు. ఆమె లేక‌పోతే షో చూడ‌ట‌మే వేస్ట్ అని మండిప‌డుతున్నారు.