టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్… కారణం అదేనా…?

-

మూడు వన్డేల సీరీస్ లో భాగంగా భారత్, విండీస్ జట్ల మధ్య విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ జట్టు… టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది… పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించే అవకాశం ఉండటంతో పోలార్డ్ చేజింగ్ కే మొగ్గు చూపించాడు. తొలి వన్డేలో… విండీస్ జట్టు హిట్మేయర్, హోప్ లు సెంచరీలు సాధించడంతో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీం ఇండియా తుది జట్టులో స్వల్ప మార్పులు చేసింది.

తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న యువ ఆటగాడు శివం దుబేని తుది జట్టు నుంచి తప్పించింది. తొలి మ్యాచ్ లో… బ్యాటింగ్ లో కూడా దుబే పెద్దగా ఆకట్టుకోలేదు, అతని స్థానంలో శార్దుల్ ఠాకూర్ ని జట్టులోకి తీసుకున్నారు. భువనేశ్వర్ కి గాయం కావడంతో అతన్ని తుది జట్టులోకి తీసుకున్నారు. టీం ఇండియా ఓపెనర్లు గా… రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ రానున్నారు. విశాఖ లో బ్యాటింగ్ కి అనుకూలించే,

అవకాశం ఉండటంతో టీం ఇండియా భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే విండీస్ జట్టు బౌలింగ్ లో కూడా బలంగా ఉండటంతో ఏ మేరకు స్కోర్ సాధిస్తుంది అనేది చూడాలి. తొలి మ్యాచ్ లో విఫలం అయిన ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ ఈ మ్యాచ్ లో ఆడితే, మూడో స్థానంలో వచ్చే కోహ్లి… సత్తా చాటితే 350 స్కోర్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. తొలి మ్యాచ్ లో మిడిల్ ఆర్డర్ ఆదుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news