ఒకేసారి ఐదు డివైజ్‌లలో వాట్సాప్‌

-

వాట్సాప్‌ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ ఎట్టకేలకు విడుదల అయింది. ఈ ఫీచర్ సాయంతో వినియోగదారులు ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించవచ్చు. ప్రైమరీ డివైజ్‌తో కాకుండా మరో నాలుగు డివైజ్‌ (ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌) లలో ఒకే నంబర్ తో ఒకేసారి వాట్సాప్‌ ఖాతాను లాగిన్‌ చేయొచ్చు. అంటే గరిష్టంగా ఐదు డివైజ్‌లలో వాట్సాప్‌ వాడుకోవచ్చు అన్న మాట. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్‌ బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే అందరు వినియోగదారులకు ఈ ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చేలా వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్ బుక్ కృషి చేస్తోంది.

వాట్సాప్‌ మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ అందుబాటులోకి రావడంతో ప్రైమరీ డివైజ్‌ స్విచ్ ఆఫ్ అయినా కూడా ఇతర డివైజ్‌లలో వాట్సాప్‌ వాడుకోవచ్చు. అయితే గతంలో ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌లలో వాట్సాప్‌ వాడాలంటే ప్రైమరీ డివైజ్‌ ఆన్ చేసి ఉండడంతో పాటు దానికి ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉండాలి. ప్రస్తుతం ఈ ఫీచర్ తో ఒకసారి డివైజ్‌ లింక్ చేస్తే ప్రైమరీ డివైజ్‌ లేకుండానే వాట్సాప్‌ వాడుకునే సదుపాయం ఉంది. ప్రైమరీ డివైజ్‌లో ఉన్నట్టే కాంటాక్ట్ లిస్ట్‌, ఛాట్‌ హిస్టరీ అన్ని వేర్వేరుగా మల్టీ డివైజ్‌లకు కూడా కనెక్ట్ అవుతాయని వాట్సాప్ పేర్కొంది. మొబైల్‌లో ఉన్నట్లుగా ప్రతి డివైజ్‌కి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉంటుందని … భద్రత విషయంలో ఆందోళన ఆవసరం లేదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news