క్రికెటర్ ముషీర్ ఖాన్ హెల్త్ పై డాక్టర్లు ఏమన్నారంటే..?

-

ముంబై యువ ఆల్ రౌండర్, టీమిండియా క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవే పై ముషీర్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముషీర్ మెడకు గాయాలయ్యాయి. దీంతో ముషీర్ ను హుటాహుటిన లక్నోలోని మేదంతా ఆసుపత్రికి తరలించారు. తాజాగా అతడి ఆరోగ్య పరిస్థితులు విడుదల ప్రకటన చేశారు.

ముషీర్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని, కోలుకోవడానికి కొంత సమయం పడుతోందని మేదాంత హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ భోలా సింగ్ చెప్పారు. రోడ్డు ప్రమాదంలో క్రికెటర్ ముషీర్ ఖాన్ మెడకు గాయం అయింది. అత్యవసరమైతే మెరుగైన చికిత్స కోసం ముంబై కి తరలిస్తాం. అతను కోలువడానికి కొంత సమయం పడుతుంది అని బోలా సింగ్ తెలిపారు. బీసీసీఐ సహా ముంబై క్రికెట్ అసోసియేషన్ అతని ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం.

Read more RELATED
Recommended to you

Latest news