రక్తం బాగుందంటే దాని అర్థం…. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం సరిగా ఉందన్నమాట. రక్తంలో ఈ హిమోగ్లోబిన్ శాతం ఆడవారిలో అయితే 12 నుంచి 15 ఎం .జి శాతం వరకు మగవారిలో 13 నుంచి 17 శాతం ఉంటుంది. ఈ శాతం తగ్గడం వలన కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తెలుపుతాయి.తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం, వైరల్ జ్వరాలు,పొట్టలో నులిపురుగులు సమస్య, అల్సర్ తో రక్తస్రావం, రుతుక్రమణ సమయంలో జరిగే రక్తస్రావం, ఆపరేషన్లు…ఇలా అనేక కారణాల వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతూ ఉంటుంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ప్రోటీన్లు, ఐరన్, విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. హిమోగ్లోబిన్ లోపం వలన అలసట,రక్తం త్వరగా గడ్డకట్టకపోవడం,బలహీనమైన ఎముకలు, గొంతు,నాలుక సమస్యలు ఉత్పన్నమవుతాయి. బీట్రూట్ రక్తహీనత మరియు హిమోగ్లోబిన్ లోపం నివారణకు అమోఘంగా పనిచేస్తుంది. ఇందులో పుష్కలంగా లభించే ఐరన్ రక్తం లో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సహకరిస్తుంది.సుమారు20 రోజుల పాటు బీట్రూట్ రసాన్ని తీసుకుంటే మంచి ఫలితాన్ని పొందవచ్చు.
ఐరన్ తో పాటు విటమిన్ సి కూడా హిమగ్లోబిన్ శాతాన్ని క్రమబద్ధీకరించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ,నిమ్మ,స్ట్రాబెర్రీ, బొప్పాయి, ద్రాక్ష,టమోటా వంటి వాటిని తప్పకుండా తీసుకోవాలి.గుడ్డు ఒక మంచి పోషకాహారం అని చెప్పవచ్చు. ఇందులో ప్రోటీన్లు,ఇనుము సమృద్ధిగా లభిస్తుంది. అందువల్ల ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక నెలపాటు గుడ్డును తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. అంతేకాదు పాలకూర , ఖర్జూరం లాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుకోవచ్చు. అంతేకాదు వీటి వల్ల రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది.