నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది..? .. కాంగ్రెస్ పై ఫైర్ అయినా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి 6 మాసాలు గడిచిన ఏ ఒక్క ప్రధాన హామీ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు.

ఎన్నికల కోడ్ పేరుతో సీఎం హామీలు అమలు చేయకుండా తప్పించుకుని తిరిగారని అన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేయకుండా.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ కేవలం 8 ఎంపీ సీట్లే గెలిచిందని ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. 14 సీట్లు గెలుస్తాం.. తమ పాలనకు ఈ ఎన్నికలు రెఫరెండమని సీఎం చెప్పారని.. 14 సీట్లు గెలుస్తామని కేవలం 8 సీట్లే గెలిచినందుకు రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలని ఆయన అన్నారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడూ ఇస్తారో స్పష్టం చేయాలని నిలదీశారు.18 ఏళ్లు నిండిన విద్యార్థినిలకు స్కూటీలు ఇప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. నాలుగు వేల నిరుద్యోగ భృతి ఏమైంది..? రుణమాఫీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు పెట్టుకున్నారు.. 420 హామీలు అమలు చేస్తామని సీఎం ఎప్పుడూ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటారని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news