రేపటి నుంచి స్కూళ్లు ప్రారంభము.. టైమింగ్స్ ఇవే..!

-

తెలంగాణలో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి రాష్ట్రంలో స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్లు ఉ.9 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రాథమిక పాఠశాలలు సా. 4 గంటల వరకు, ప్రాథమికోన్నత పాఠశాలలు సా.4.15 గంటల వరకు నిర్వహిస్తారు. హైస్కూళ్లు మాత్రం ఉ.9.30 గంటల నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ , సికింద్రాబాద్ లో మాత్రం ఉ.8.45 నుంచి సా.3.45 వరకే స్కూళ్లు ఉంటాయి.

జూన్ 19వ తేదీ వరకు కొనసాగనున్న బడిబాటలో భాగంగా.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివితే వచ్చే విద్యా, అవకాశాలపై తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు వివరించనున్నారు. బడిబాట ప్రోగ్రాంలో భాగంగా జూన్ 12వ తేదీన తెలంగాణ‌ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news