ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న కోవిడ్ వేరియెంట్లను గుర్తించేందుకు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు సరిపోవడం లేదు. దీంతో పలు భిన్నరకాల టెస్టులు చేసి కోవిడ్ ఉందీ, లేనిదీ నిర్దారిస్తున్నారు. అలాంటి టెస్టుల్లో డి-డైమర్ టెస్టు కూడా ఒకటి. దీని వల్ల శరీరంలో బ్లడ్ క్లాట్స్ ఉందీ, లేనిదీ తెలుస్తుంది. కోవిడ్ అత్యవసర స్థితిని ముందుగానే పసిగట్టేందుకు అవకాశం ఉంటుంది.
డి-డైమర్ టెస్టులో శరీరంలోని బ్లడ్ కాట్స్‌ను గుర్తిస్తారు. క్లాట్స్ ఏర్పడ్డాక 8 గంటల వరకు ఈ టెస్టుతో క్లాట్స్‌ను గుర్తించవచ్చు. సాధారణంగా కోవిడ్ వచ్చిన వారిలో ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ఇన్‌ఫెక్షన్ వేగంగా పెరుగుతుంది. దీంతో శరీరంలో క్లాట్స్ ఏర్పడుతుంటాయి. ఇన్‌ఫెక్షన్ తీవ్రత పెరిగే కొద్దీ క్లాట్స్ ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అయితే డి-డైమర్ టెస్టు సహాయంతో శరీరంలో క్లాట్స్‌ను గుర్తించవచ్చు.
డి-డైమర్ టెస్టు ద్వారా క్లాట్స్‌ను గుర్తిస్తే కోవిడ్ అత్యవసర స్థితి ఉందీ, లేనిదీ తెలుస్తుంది. అంటే ఎక్కువ సంఖ్యలో క్లాట్స్ ఉన్నట్లు రిపోర్టులో వస్తే పరిస్థితి తీవ్రతరం అవుతుందని అర్థం. అలాంటి బాధితులకు వెంటనే ఆక్సిజన్ ద్వారా చికిత్సను అందించాలి. క్లాట్స్ చాలా తక్కువగా ఉంటే పరిస్థితి అత్యవసరం కాదని తెలుస్తుంది. అలాంటి వారికి సాధారణ చికిత్సను అందిస్తే సరిపోతుంది. ఇలా డి-డైమర్ టెస్టు ఉపయోగపడుతుంది. కోవిడ్ పేషెంట్లకు అత్యవసర స్థితి ఉందా, లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు ఈ టెస్టును చేస్తున్నారు.