ఎమ్మెల్సీ రేసు..పోటీ ఎక్కువే…కౌశిక్ పొజిషన్ ఏంటి?

-

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఈసీ.. షెడ్యూల్‌ విడుదల చేసింది. నవంబర్ 29న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ జరపనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరగాల్సి ఉంది. ఆరు స్థానాలు ఖాళీ అయ్యి దాదాపు ఐదు నెలలు కావొస్తుంది…కాని కోవిడ్ నేపథ్యంలో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగలేదు.

koushik reddy
koushik reddy

పైగా హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడింది. అంటే హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత పరిస్తితులు బట్టి ఎమ్మెల్సీలు డిసైడ్ చేయొచ్చని గులాబీ బాస్ భావించినట్లు కనిపిస్తోంది. ఎలాగో నవంబర్ 2న హుజూరాబాద్ ఫలితం వస్తుంది. ఆ ఫలితం తర్వాత పరిస్తితులు బట్టి ఎమ్మెల్సీలని డిసైడ్ చేయనున్నారు. అయితే 6 ఎమ్మెల్సీలు టీఆర్ఎస్కే దక్కనున్నాయి. దీంతో గులాబీ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది.

అయితే గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌లకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా లేదా? అనేది చూడాలి. కానీ కడియం పదవి ఆశిస్తున్నారు. ఇక టీఆర్ఎస్‌లో చేరిన ఎల్. రమణ, మోత్కుపల్లి నరసింహులు, పెద్దిరెడ్డిలకు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు. అలాగే నాగార్జున సాగర్ ఉపఎన్నిక సమయంలో కోటిరెడ్డికి పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే ఈ ఎమ్మెల్సీ రేసులో చాలామంది సీనియర్లు ఉన్నారు…మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరావు, అరికెల్ల నర్సింహా రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దేశపతి శ్రీనివాస్, జూపల్లి కృష్ణరావులు ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. వీరగాక ఇంకా కొంతమంది ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. మరి వీరిలో కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే ఇప్పటికే కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి కేసీఆర్ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. విశేష సేవలు అందించిన వారికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీని చేస్తారని చెప్పి గవర్నర్…దీనిపై మరొకసారి ఆలోచించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ప్రతిపాదనని పక్కనబెట్టారు. ఈ విషయంలో కేసీఆర్…గవర్నర్‌లు ఎలాంటి సూచనలు చేయలేదు. అయితే హుజూరాబాద్ ఫలితం బట్టే కౌశిక్ పదవి ఆధారపడి ఉందని తెలుస్తోంది. టీఆర్ఎస్ గెలిస్తే ఓకే…లేదంటే కౌశిక్ పదవి డౌటే.

Read more RELATED
Recommended to you

Latest news