ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి నేడు విశ్వ వేదికపై ఆర్ఆర్అర్ సినిమాలో నాటు నాటు పాటకు గాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అనంతరం ఎమోషనల్ అవుతూ భావోద్వేగంతో ప్రసంగించారు.. 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధాన ఉత్సవంలో ఎం ఎం కీరవాణి నాటినాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును అందుకున్నారు. అనంతరం అందరికీ అభివాదం చేస్తూ ఎమోషనల్ అయ్యారు.. లిరికిస్ట్ చంద్రబోస్‌తో కలిసి అవార్డును అందుకున్న కీరవాణి.. “నా మనసులో ఒకే ఒక కోరిక ఉండేది. అదే అర్అర్అర్ గెలవాలి. ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. ఆర్‌ఆర్‌ఆర్.. నన్ను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టింది. ఆర్‌ఆర్‌ఆర్ దేశాన్ని గర్వపడేలా చేసింది.” అని అన్నారు.
కాగా ఆస్కార్ అవార్డ్ ను చేతపట్టుకుని ఇంగ్లీష్‌లో పాట పాడుతూ పరవశించిపోయారు కీరవాణి. దర్శకుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తీకేయ.. తన కుటుంబ సభ్యుల సహకారాన్ని ఈ పాట ద్వారా చెబుతూ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
@mmkeeravaani #NaatuNaatuSong #Oscars #RRRForOscars @RRRMovie pic.twitter.com/VM0iS4V7S5
— BA Raju's Team (@baraju_SuperHit) March 13, 2023
తెలుగు తో పాటు తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన కీరవాణి నేడు విశ్వవేదికపై నిలిచారు. అయితే ఈయన ప్రయాణం అంత సాఫీగా జరగలేదు. ఆర్థికంగా నలిగిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి సంగీతాన్ని నమ్ముకుని తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 30 రూపాయల జీతం నుండి ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును అందుకునే స్థాయికి వచ్చారు..
సినీ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు మమత అనే తెలుగు చిత్రం ద్వారా సినీ రంగానికి పరిచయమయ్యారు కీరవాణి. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘క్షణక్షణం’, ‘అల్లరి మొగుడు’ ఘరానామొగుడు, సుందరకాండ, అల్లరిప్రియుడు, శ్రీరామదాసు, నేనున్నాను, చత్రపతి, శుభసంకల్పం, పెళ్లి సందడి వంటి ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించారు తమ్ముడు రాజమౌళితో చేసిన ప్రతి సినిమాకు ఆయన సంగీతాన్ని అందిస్తూ వస్తున్నారు. దాదాపు 250 కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించిన కీరవాణి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ చిత్రసీమలో పనిచేశారు.