ప్రస్తుతం మనకు భిన్న రకాల కంపెనీలు వంట గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాయి. గ్యాస్ సిలిండర్లను మనం పలు రకాలుగా బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్నాక 3 నుంచి 7 రోజుల్లోగా సిలిండర్ను డెలివరీ చేస్తారు. అయితే ప్రస్తుతం దాదాపుగా చాలా వరకు కంపెనీలు సబ్సిడీని ఇవ్వడం లేదు. ఆ విషయం పక్కన పెడితే వంట గ్యాస్ సిలిండర్ ను చూసినప్పుడు వాటిపై మనకు కొన్ని రకాల నంబర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా చిత్రంలో ఇచ్చినట్లుగా నంబర్లు లోపలి వైపు ఉంటాయి. అయితే అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మనం వాడే ఏ వస్తువుకు అయినా సరే ఎక్స్పైరీ తేదీ ఉంటుందని తెలుసు కదా. అలాగే వంట గ్యాస్ సిలిండర్లకు కూడా ఎక్స్పైరీ తేదీ ఉంటుంది. చిత్రంలో ఇచ్చిన నంబర్ అవే వివరాలను సూచిస్తుంది.
మనకు ఏడాదిలో 12 నెలలు ఉంటాయి కదా. అయితే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలను సూచించేందుకు గాను ఆంగ్ల అక్షరం A ను వాడుతారు. అదే ఏప్రిల్, మే, జూన్ నెలలను సూచించేందుకు B అక్షరాన్ని, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు C అక్షరాన్ని, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలను సూచించేందుకు D అక్షరాన్ని ఉపయోగిస్తారు.
ఇక పైన ఇచ్చిన చిత్రంలో B.13 అని ఉంది కదా.. అంటే ఆ సిలిండర్ 2013లో ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఎక్స్పైర్ అవుతుందని అర్థం. ఇలా ఆ నంబర్లను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.