అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటీ…? బ్రహ్మను శివుడు ఎందుకు శపించాడు…?

-

అసలు జ్యోతిర్లింగం అంటే ఏంటీ…? చాలా మంది శివభక్తులకు కూడా జ్యోతిర్లింగం అంటే ఏంటీ అనేది తెలియదు. కేవలం 12 లింగాలు మాత్రమే ఉన్నాయని, వాటిని జ్యోతిర్లింగాలు అంటారు అని మాత్రమే తెలుసు. మరి జ్యోతిర్లింగం అంటే ఏంటీ…? శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు, తమలో తాము “నేను గొప్ప అంటే నేను గొప్ప” అని వాదించుకున్నారట. అయితే క్రమంగా వివాదంగా మారిందట.

దీనితో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలని భావించి, ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసిందని పురాణాలు చెప్తున్నాయి. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించదాంతో అప్పటి వరకు వారి మధ్యన ఉన్న ఆధిపత్య పోరు తాత్కలికంగా చల్లారింది. ఆ మహా లింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిలో కలిగిందని చెప్తూ ఉంటారు.

బ్రహ్మ హంసా రూపం దరించి లింగం అగ్ర బాగాన్ని చూడడానికి, విష్ణువు వరాహ రుపమలో ఆదిని కనుక్కోవడానికి బయల్దేరతారు. బ్రహ్మకు ఎంతకు లింగం అగ్ర భాగం కాని మొదలు కాని కనిపించలేదు. ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం (మొగలి పువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని అపి తనకు ,విష్ణువుకు మధ్య జరిగిన జరిగిన గొడవను వివరిస్తాడు. సహాయం చేయమని కోరతాడు.

ఆవు కనపడితే అదే విధంగా చెప్పి,ఆ లింగం అగ్ర భాగాన్ని చూసినట్లుగా, విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇవ్వాలని ప్రాదేయపడ్డాడు. సాక్షాత్తు సృష్టి కర్తయే తనని బ్రతిమాలేసారికి కాదనలేక సరే అంటుంది. రెండు, కిందకు దిగి వచ్చే సరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్ర భాగాన్ని చూశానని, కావాలంటే అవును, మొగలి పువ్వును అడగమని చెప్తాడు.

నిజమే అంది మొగలి పువ్వు,బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక అయన లింగం అగ్ర భాగాన్ని చూసాడని ఆవు తలతో చెప్తుంది. అయితే అబద్దం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మ దేవుడి చేస్తున్న అసత్య ప్రచారాన్ని చూడ లేక ఈశ్వరుడు ప్రతయ్యక్షమయ్యాడు. బ్రహ్మ దేవుడు అబద్దం చెప్పిన కారణం భూలోకంలో ఎచ్చటా పూజలు అందుకోడానికి అర్హత లేకుండా శపించాడు శివుడు.

విష్ణువుకు ప్రజలు నిరంతరం కొలిచేటట్లు వరం ఇచ్చాడు. శివుడు ఏర్పాటు చేసిన “జ్యోతిర్లింగం” అనంతమైనది. దానినుండి వెలువడిన కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అయ్యాయి. సాధారణంగా జ్యోతిర్లింగాలు 64 కానీ వాటిలో 12 మాత్రం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ పన్నెండు జ్యోతిర్లింగాలలో ప్రతీదీ అచ్చట గల ప్రధాన దైవం పేరుతోనే ఉంటాయి. ప్రతీదీ ప్రత్యేకతను సంతరించుకుంటాయి.

ఈ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రధాన దైవం “లింగము” గా ఉంటుంది . ఇది అనంతమైన జ్యోతిర్లింగ స్తంభంగా భావిస్తారు భక్తులు. ఇది అనంతమైన శివతత్వానికి నిదర్శనమంటారు భక్తులు. ఈ జ్యోతిర్లింగాలు గుజరాత్ లోని సోమనాథుడు, శ్రీశైలం లోని మల్లిఖార్జునుడు, ఉజ్జయిని లోని మహాకాళేశ్వరుడు, మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వరుడు, హిమాలయాలలోని కేదారినాథుడు, మహారాష్ట్ర లోని భీమశంకరుడు, వారణాశి లోని కాశీ విశ్వనాథుడు, మాహారాష్ట్రలోని త్రయంబకేశ్వరుడు, డియోగర్ లోని వైద్యనాథుడు, ద్వారక లోని నాగేశ్వరుడు, తమిళనాడులోని రామేశ్వరుడు మరియు ఔరంగాబాద్ లోని గ్రీష్మేశ్వరుడు.

Read more RELATED
Recommended to you

Latest news