ఇద్దరి మధ్య జరుగుతున్న సంభాషణలో ఒకరు మాత్రమే నోరు విప్పి, అవతలి వారికి ఛాన్స్ ఇవ్వకుండా లొడలొడా వాగుతున్నారంటే, వినేవాళ్లకి బోర్ కొట్టడం ఖాయం. ఇద్దరి మధ్య సంభాషణ బోర్ కొట్టకుండా ఉండాలంటే ఇద్దరూ మాట్లాడాలి. ఒకరు ఎక్కువ మాట్లాడితే మరొకరు కనీసం ప్రశ్నలైనా అడగాలి. అలా కాని పక్షంలో వింటున్నవారికీ, చెబుతున్నవారికీ
బోరింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం మనం అవతలి వారికి బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎలాంటి లక్షణాలు ఉండకూడదో తెలుసుకుందాం.
ప్రతీసారీ యెస్ చెప్పకండి. అలా అనీ ప్రతీసారీ నో చెప్పవద్దు. ఎప్పుడైనా పట్టూవిడుపూ ఉండాలి. ఏదొక్కటి లేకపోయినా మిమ్మల్ని లెక్కల్లోంచి తీసేస్తారు.
మీ గురించి మీరు చెప్పుకోవడానికి భయపడకండి. భయపడేవారు అవతలి వారికి బోర్ కొట్టిస్తారు.
మీ కంఫర్ట్ జోన్ వదిలి బయటకి రాకపోతే అవతలి వారికి బోర్ కొట్టిస్తారు. ఎదుటివాళ్ళు మీ చేత ఆకర్షింపబడాలంటే కంఫర్ట్ జోన్ వదిలి రావాలి.
ప్రతీసారి మీ గురించి మీరు చెప్పుకోకండి. ఊరికే మీ విషయాలే వినాలని ఎవ్వరూ అనుకోరు.
ఎక్కువగా కంప్లైంట్లు చేస్తుంటే అది అవతలి వారికి బోరింగే. అబ్బా ఏంటీ గోల అని అనిపించకమానదు.
ఎదుటివారు చెప్పింది సరిగ్గా వినకపోతే బోర్ ఫీలవడం ఖాయం. మీ పనిలో మీరుండి అవతలి చెప్పేది వినకపోతే మీతో చెప్పడమే మానేస్తారు.
అవతలి వారిని కొంచెమైనా పట్టించుకునేలా ఉండాలి. కనీసం క్లిష్ట పరిస్థితుల్లోనైనా. అలా లేనపుడు మీతో మాట్లాడాలని వాళ్ళెందుకు అనుకుంటారు. కష్టకాలంలో మాట్లాడే నాలుగు మాటలే మీపట్ల వారికి అమితమైన గౌరవాన్ని కలిగిస్తాయి.
ముందొకటి వెనక ఒకటి మాట్లాడేవాళ్ళు అవతలి వారికి బోర్ కొట్టించడంలో ముందుంటారు.