బ్రేకింగ్ : విజయనగరంలో ఆక్సిజన్ అందక ఐదుగురు మృతి !

ఆంధ్రప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విజయనగరంలో ఉన్న మహారాజా ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.నిన్న అర్ధరాత్రి ఆక్సిజన్ పూర్తిగా నిండుకుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ ఐసోలేషన్ వార్డులో ఉన్న ఐదుగురు పేషెంట్లు మృతి చెందారు. దీంతో ఆస్పత్రి ప్రాంగణంలో దారుణ వాతావరణం నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

దీంతో ఆసుపత్రిలో ఉన్న రోగుల బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇప్పటికీ ఆక్సిజన్ సరఫరా పునరుద్దరణ కాకపోవడంతో కొంత మందిని వేరే ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇక వెంటనే ఆసుపత్రికి చేరుకున్న జిల్లా కలెక్టర్ హరి జవహర్ లాల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా పేషెంట్స్ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పక్కనే ఉన్న విశాఖ జిల్లా నుండి దేశం మొత్తానికి ఆక్సిజన్ సరఫరా అవుతుంటే పక్కనే ఉన్న జిల్లాలో ఆక్సిజన్ లేక చనిపోయారు అంటే వినడానికి బాధగా ఉందని కొందరు అంటున్నారు.