కరోనా తీవ్రత : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

-

కరోనా తీవ్రత దృష్ట్యా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తీవ్రత పెరగడంతో భారీ సంఖ్యలో వైద్యారోగ్య సిబ్బందిని నియమించుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్పెషలిస్ట్ లు, సాధారణ వైద్యులు సహా 5546 మంది నియామకానికి ఉత్తర్వులు జారీ చేసింది.

1170 మంది స్పెషలిస్ట్ లు, 1170 మంది జనరల్ ఫిజిషియన్ లు, 2 వేల మంది స్టాఫ్ నర్సులు, 306 మంది అనస్థిషియా నిపుణులు, 300 మంది చొప్పున ఎఫ్ ఎన్ వో, ఎం ఎన్ వో, స్వీపర్ల నిమాయకం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలపాటు కాంట్రాక్టు పద్ధతిన నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వైద్య సిబ్బంది నియామకానికి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news