పసి పిల్లలు ఎక్కువగా ఏడవడానికి కారణాలు ఇవే…!

-

ఎక్కువగా పసి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణమే. ఇలా పసి పిల్లలు ఏడవటం వల్ల వారి ఆరోగ్యం బాగుంటుందని కొంత మంది అంటారు. కానీ ఒకొక్క సారి ఆపకుండా ఎక్కువ సేపు ఏడుస్తుంటారు. నిజంగా వాళ్ళ ఏడుపుని ఆపడం కష్టమై పోతుంది తల్లిదండ్రులకి. అయితే పసి పిల్లలు ఎక్కువ ఏడవడానికి కారణం ఏమిటి..? ఈ విషయం లోకి వస్తే.. చైల్డ్ సైకియాట్రిస్ట్ నిపుణులు ఏమంటున్నారంటే…? పసి పిల్లలు ఏడుపు ఒక భాష అని అంటున్నారు.

ఏడుస్తూ వాళ్ళు ఏదో ఒకటి చెబుతుంటారు. పిల్లలకు ఆకలిగా ఉన్నప్పుడు ఏడుపు ఆపకుండా నిరంతరం గట్టిగా అరుస్తూనే ఉంటారు. తల్లి పక్కన ఉంది వాళ్ళ ఆకలి తీర్చాలి. ఈ విషయాన్నీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. మధ్య మధ్య లో ఉ..ఊ అంటూ ఏడుస్తున్నారంటే.. ? తమ తల్లి తన దగ్గరకు రావాలని భావించి అలా అంటుంటారు. తల్లి వెళ్లి అక్కడ ఉంటె పడుకోరు కొందరు.

ఒకవేళ వాళ్ళు ఎంతో బిగ్గరగా ఉలిక్కి పడే విధంగా ఏడుస్తున్నారంటే..? చెవి నొప్పి లేదా కడుపు నొప్పి అయ్యి ఉండొచ్చని పరిశోధకులు అంటున్నారు. అలాంటి సమయం లో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించాలి. ఏది ఏమైనా పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారనేది తల్లికి అర్ధం అయ్యి వాళ్ళని కొంచెం కంఫర్ట్ చెయ్యాలి. లేక పోతే పిల్లలు అలా ఏడుస్తూనే ఉంటారు. జాగ్రత్తగా వాళ్ళని గమనించి కావల్సినవి ఇవ్వాలి. మరీ ఎక్కువ సేపు ఏడిస్తే మాత్రం ఆసుపత్రి కి తీసికెళ్ళడం మంచిది. కొందరు పిల్లలు రోజంతా కూడా ఏడుస్తారు. ఎప్పుడు ఏడ్చినా  తల్లిదండ్రులు పక్కనే ఉండి చూసుకొని ఇబ్బంది ఏమిటో తెలుసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news