ప్రజల మధ్యలో ఉండే సమస్యలను పరిష్కరించి వారి మధ్య ఐక్యత పెంచాల్సిన నాయకులు ప్రాంత విభేదాలు తీసుకొని వస్తే వారిని ఏమనాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులుగా ఉన్న వారు అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తామని ప్రమాణం చేసిన దొరలు ఇప్పుడు తమ నోటి మాటలతో ఒక ప్రాంతాన్ని కించపరిచేలా కామెంట్ చేయడం నిజంగా దారుణం అనే చెప్పాలి.
వివరాల్లోకి వెళితే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విశాఖను లుంగీ బ్యాచ్లు పాడు చేస్తున్నాయని మరియు జనమంతా వీరిని చూసి వణికిపోతునారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో లుంగీ బ్యాచులు దిగిపోయి ఇక్కడ కడప కల్చర్ మొదలైందని మరియు పులివెందుల ఫ్యాక్షన్ ఇక్కడ కూడా ప్రారంభమవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
ఇంకా చెప్పాలంటే కడప కల్చరల్ స్మార్ట్ సిటీ లోకి ప్రవేశించి అభివృద్ధి అనేది ఎక్కడా లేకుండా లేకుండా సర్వ నాశనం చేస్తుందని ఆయన మాట్లాడిన మాటలు చూసి విశాఖలోని ప్రజలంతా ఇదంతా నిజమేనేమో అని వణికిపోతున్నారు. మంత్రిగా పనిచేసిన ఆయనకు కడప అంటే పరాయి దేశంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
ఇక లుంగీ బ్యాచులంటూ మరో గడ్డ కల్చర్ ని కించపరచే హక్కు ఎవరు ఇచ్చారని గద్దిస్తున్నారు. మొత్తానికి ఎవరు ఏమనుకుంటే నాకేంటి అన్న తరహాలో అయ్యన్న సహా తమ్ముళ్ళు ఆరేళ్ళుగా విశాఖలో కడప కల్చర్ అంటూ రెచ్చగొడుతూనే ఉన్నారు. విశాఖ కడపల మధ్య గొడవలు పెడుతూనే ఉన్నారు.