ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మళ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మే 15లోగా తమ నూతన ప్రైవసీ పాలసీకి యూజర్లు అనుమతి తెలపాల్సి ఉంటుంది. లేకపోతే వాట్సాప్‌ను వాడుకోలేరు. అయితే గత వారం కిందటే ఆ తేదీని వాట్సాప్ ప్రకటించినా.. దాన్ని ఇంకా పూర్తిగా నిర్దారించలేదు. కానీ ఇప్పుడు తాజాగా వాట్సాప్ ఆ తేదీని నిర్దారిస్తూ ప్రకటన చేసింది. ఈ క్రమంలో మే 15 లోపు యూజర్లు వాట్సాప్ కొత్త పాలసీకి ఓకే చెప్పాల్సి ఉంటుంది. లేదంటే వాట్సాప్‌ను ఉపయోగించుకోలేరు. ఈ మేరకు వాట్సాప్ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
గతంలో వాట్సాప్ తన నూతన పాలసీకి అమలుకు ఫిబ్రవరి 8వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించగా.. యూజర్ల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విమర్శలకు వెనక్కి తగ్గింది. తమ పాలసీపై లేని పోని అనుమానాలు సృష్టిస్తూ యూజర్లలో అపోహలను పెంచారని, తప్పుడు సమాచారం యూజర్లకు చేరిందని, అందువల్లే వారిలో అనుమానాలు వ్యక్తమయ్యాయని వాట్సాప్ తెలిపింది. దీంతో తమ పాలసీ అమలును తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ తాజాగా వాట్సాప్ కొత్త తేదీని ప్రకటించింది.
వాట్సాప్ గతంలో తీసుకున్న కొత్త పాలసీ అమలు నిర్ణయం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున యూజర్లు ఆ యాప్‌ను వదిలి సిగ్నల్, టెలిగ్రామ్ వంటి యాప్‌లకు మారారు. అయితే కొత్త పాలసీ అమలుపై వెనక్కి వెళ్లేది లేదని, మే 15 చివరి గడువు అని వాట్సాప్ తాజాగా ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో ఆ తేదీ తరువాత ఏమవుతుందా ? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ముందు ముందు వాట్సాప్‌ను యూజర్లు వదిలేస్తారా, వాడుతారా ? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.