ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు మరో కొత్త ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రస్తుతం అనేక రకాల ఫేక్ న్యూస్ విస్తృతంగా ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేలా వాట్సాప్‌లో కొత్తగా చాట్‌బాట్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీని సహాయంతో యూజర్లు తమకు వచ్చే మెసేజ్‌లలో ఉండేవి నకిలీ వార్తలో, అసలు వార్తలో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
కాగా వాట్సాప్‌లో అందిస్తున్న చాట్‌బాట్ ఫీచర్ కోసం ఆ సంస్థ ఇప్పటికే పాయింటర్ ఇనిస్టిట్యూట్ కు చెందిన ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్ చెకింగ్ నెట్‌వర్క్ (ఐఎఫ్‌సీఎన్)తో భాగస్వామ్యం అయ్యింది. ఈ క్రమంలో యూజర్లు ఏదైనా వార్త గురించి ఆ చాట్‌బాట్‌లో సెర్చ్ చేయగానే అందులో ఉండే డేటాబేస్ సహాయంతో ఆ వార్త నకిలీదా, అసలుదా అని సదరు చాట్‌బాట్ నిర్దారించి.. ఆ వివరాలను యూజర్‌కు తెలియజేస్తుంది. దీంతో ఫేక్‌న్యూస్‌కు అడ్డుకట్ట వేయవచ్చు.
ఇక ప్రస్తుతానికి చాట్‌బాట్ ఫీచర్‌ను కేవలం ఇంగ్లిష్ భాషలో మాత్రమే అందిస్తున్నారు. త్వరలోనూ పలు ఇతర భాషల్లోనూ ఈ ఫీచర్ లభిస్తుంది. ఇక ఈ ఫీచర్‌ను అందించేందుకు గాను వాట్సాప్ ఇప్పటికే 74 దేశాల్లోని 80కి పైగా ఫ్యాక్ట్ చెకింగ్ ఆర్గనైజేషన్లతో భాగస్వామ్యం అయింది. వాటి సహాయంతో వాట్సాప్ ఫేక్ న్యూస్‌కు అడ్డుకట్ట వేయనుంది. ఇక భారత్‌లోని వాట్సాప్ యూజర్లు 73700 07000 అనే ఫోన్ నంబర్‌ను తమ కాంటాక్ట్‌లలో సేవ్ చేసుకుని దానికి మెసేజ్‌లను పంపించడం ద్వారా ఆ చాట్‌బాట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.