అసలే మంచి పేరు రావట్లేదు .. పనిగట్టుకుని చెడ్డ పేరు తెచ్చుకోవడం దేనికి ?? 

-

జగన్ అధికారంలోకి రావటం తోనే ఎంతోమంది రాజకీయ సలహాదారులను నియమించడం జరిగింది. తన తండ్రి మాదిరిగానే తనకి మంచి పేరు రావాలని మంచి దూకుడుగా వ్యవహరిస్తున్న. ఈ క్రమంలో ఎన్నో సంక్షేమ పథకాలు మీడియా ముందు చెబుతున్న వాటి అమలు విషయంలో సరైన విధానం లేక విమర్శలు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా న్యాయస్థానాల దగ్గర అయితే మొట్టికాయలు వేయించుకుంటున్నారు. ఈ విధంగా చెప్పిన పనులు చేస్తూనే మంచి పేరు సంపాదించుకోలేక చతికల పడుతున్నారు. ఇటువంటి సమయంలో కరోనా వైరస్ కట్టడి విషయంలో రాష్ట్రంలో అన్ని మద్యం దుకాణాలను క్లోజ్ చేయడం జరిగింది.What are the Drinking etiquettes around the world - Dr. Vidya ...అంతకు ముందు నుండే మద్యం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పూర్తి మద్యపాన నిషేధం రాష్ట్రంగా ఏపీని చేస్తానని హామీ కూడా ఇచ్చారు. ఈ విషయంలో ఇటీవల జగన్ తీసుకొన్ననిర్ణయం పనిగట్టుకుని ఆయనకు చెడ్డపేరు తెచ్చినట్లు అయ్యింది. ఇటీవల లాక్ డౌన్ సడలింపులు ఇలా ప్రకటించారో లేదో కానీ అలా మద్యం దుకాణాలు తెరిచేసి జగన్ అల్లరిపాలు అయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధంపైన తన చిత్తశుధ్ధి ఇదేనా అంటూ విపక్షాలు చేత తీటించుకుంటున్నారు.

 

మరోపక్క మద్యం షాపులు చాలా రోజుల తర్వాత ఓపెన్ అవటంతో జనాలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో రావడంతో వైద్య నిపుణులు కూడా ఏపీ సర్కార్ పై మండి పడుతోంది. ఈ విధంగా వ్యవహరిస్తే ముందు షాపుకి వెళ్లి కరోనా వైరస్ ఈజీగా సోకించు కోవచ్చని అంటున్నారు. ఒక్కసారిగా జగన్ ఏమి ఆలోచించకుండా మందు షాపు ఓపెన్ చేయటంతో పనిగట్టుకుని హామీ ఇచ్చి మరి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నటు అయింది ప్రజెంట్.

Read more RELATED
Recommended to you

Latest news