శరీరం వేడి చేస్తే ఈ చిన్న చిట్కాలు పాటించండి చాలు.. ఇట్టే మటుమాయం..!

చాలామంది ఎదుర్కునే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో శరీరం వేడి అవ్వడం కూడా ఒకటి. కొంతమందికి వేడి చేసే ఆహారపదార్ధాలు అంటే బాగా మసాలా దినుసులతో కూడిన ఆహారం గాని, బాగా స్పైసిగా ఉంటే ఫుడ్ గాని తింటే వెంటనే వేడి చేస్తుంది. కొంతమందికి చికెన్ తిన్నగాని వేడి చేస్తుంది. గొంతులో నొప్పి ఉండటం, మూత్రానికి వెళ్ళినప్పుడు మంటగా ఉండడం, మలబద్ధకం, తల నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఒక్కోసారి ఏమిచేయాలో కూడా తెలియని పరిస్థితి. అందుకనే వేడి చేసినప్పుడు మెడిసిన్‌‌ పై ఆధార పడకుండా సహజంగానే శరీరం యొక్క వేడి సమస్య ను తగ్గించుకోవాలి. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

body heat
body heat

తరుచుగా మనం తీసుకునే ఆహారపు అలవాట్లతో శరీరంలో ఉండే అధిక వేడిని తగ్గించవచ్చు. ముందుగా శరీరంలో వేడి తగ్గాలంటే ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి. ఇక్కడ మీరు ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి. అది ఏంటంటే ఫ్రిజ్ లో పెట్టిన నీరు తాగకూడదు. కొంతమందికి ఫ్రిడ్జ్ లో నీరు తగిన గాని వేడిచేస్తుంది. అందుకే మామూలు నీటిని మాత్రమే తీసుకోవాలి. వేడిని తగ్గించడంలో నీరు పనిచేసినట్టుగా మరి ఏది పని చేయదు. అలాగే వేడి తగ్గాలంటే మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుండాలి. ఇలా తాగుతుంటే నెమ్మదిగా వేడి తగ్గుతుంది. అలాగే సగ్గు బియ్యం జావ కూడా వేడి తగ్గడానికి మంచి మార్గం. సగ్గుబియ్యం నానపెట్టి, తరువాత ఉడికించి అందులో పాలు పోయకుండా బెల్లం వేసుకుని తాగితే వేడి తగ్గిపోతుంది.

అలాగే కర్బూజా పండ్లకు చలవ చేసే గుణం అధికం. కర్బూజా పండు మందపాటి తోలు తీసేసి, చిన్న ముక్కలుగా తరిగి, పంచదార చల్లుకుని తింటే క్షణాలలో వేడి తగ్గుతుంది. అరటి పళ్లు, పుచ్చకాయ, బయాపిల్, గసగసాలు, ఎండుద్రాక్ష, చలవచేసే వాటిలో చాలా ముఖ్యమైనవి. అలాగే ఎండు ఖర్జురం కూడా వేడిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఒక మూడు లేదా నాలుగు ఎండు ఖర్జురాలను తీసుకుని రాత్రంతా శుభ్రమైన నీటిలో నానపెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగితే వేడి తగ్గుతుంది. వీటితో పాటు గ్లాసు వేడిపాలు తీసుకుని  అందులో  2 లేక 3 చిన్న చిన్న పచ్చకర్పూరం పలుకులు, కొంచెం యాలుకల  పొడి, తగినంత గసగసాల పొడి కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తాగితే వేడి మాయమవుతుంది. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది. మీరు ఎటువంటి ఆహార పదార్ధాలు తింటే శరీరంలో వేడి ఎక్కువ అవుతుందో అటువంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ తిన్నగాని పైన చెప్పిన చిట్కాలు పాటించండి.