తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు..మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి..ధరణి పోర్టర్ అధికారికంగా ప్రారంభించారు..రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తుంది..
ఇక నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లు అన్‌లైన్‌లోనే జరగనున్నాయి..వచ్చే నెల 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అమలులోకి వస్తుంది..మోసాలకు ఆస్కారమే లేకుండా..ప్రజల్లో గందరగోళం లేకుండా పక్కాగా..సులువుగా స్లాట్ బుకింగ్ చేసుకొని.. వెరిఫికేషన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకూ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది..కేవలం పది నిమిషాల్లోనే పట్టాదారు పాసుపుస్తకాలు..భూమి వివరాలు క్రయవిక్రయాలును తెలుసుకునే అవకాశం ఉంది..ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, మంత్రి మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.