ఓటీటీలో ‘గాడ్సే’ స్ట్రీమింగ్.. ఎప్పుడంటే?

-

క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ రంగంలోకి ప్రవేశించిన సత్యదేవ్.. హీరోగా పలు హిట్ సినిమాల్లో నటించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ సినీ రంగంలోకి దూసుకెళ్తున్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సత్యదేవ్.. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల సత్యదేవ్ నటించిన సినిమా ‘గాడ్సే’. జూన్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా ఫ్లాప్‌గా నమోదైంది.

సత్యదేవ్-గాడ్సే
సత్యదేవ్-గాడ్సే

గోపి గణేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదల అయ్యేందుకు సిద్ధం కానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లో జులై 17 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా మలయాళ హీరోయిన్ ఐశ్వర్య నటించారు. అలాగే ఈ సినిమాలో నాగబాబు కీలకపాత్రలో నటించారు. ప్రస్తుతం సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా త్వరలో విడుదల కానుంది. అలాగే సత్యదేవ్ హిందీలో అక్షయ్ కుమార్ ‘రామ్‌సేతు’ సినిమాలో, చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news