మానవ శరీరంలో రోగనిరోధక శక్తి కీలక పాత్ర పోషిస్తుంది. జబ్బులు రాకుండా చూడటానికి, ఎలాంటి జబ్బులు వచ్చినా తగ్గించడంలో సాయపడుతుంది. అయితే ఇమ్యూనిటీ పవర్ ప్రతిసారి ఒకేలా ఉంటుందని చెప్పలేం. కొన్నిసార్లు రోగనిరోధక శక్తి బలహీన పడొచ్చు. మరి కొన్నిసార్లు మందకొడిలా పని చేయవచ్చు. అలా జరిగినప్పుడు శరీరంలో అలర్జీల దగ్గరి నుంచి దీర్ఘకాలిక సమస్యల వరకు రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు తలెత్తే సమస్యలు వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం.
చర్మంపై దద్దుర్లు..
ఎండుగజ్జితో చర్మం మీద తలెత్తే దద్దుర్లకూ రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడమే కారణం. చర్మంపై సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థ్రయిటిస్ లవణాలు ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ అతి స్పందించినప్పుడు ఈ లవణాలు చర్మకణాల మీద దాడి చేస్తాయి. ఫలితంగా చర్మం ఎర్రబడటం, పొలుసులు లేవటం, దద్దుర్లు ఏర్పడటం జరుగుతాయి.
కళ్లు పొడి బారటం..
సాధారణం కంటే అతిగా కళ్లు పొడిబారితే దానిని జాగ్రన్స్ సిండ్రోమ్ అంటారు. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు జాగ్రన్స్ సిండ్రోమ్ ఉన్నవారిలో కన్నీరు ఎండిపోతుంది. ఫలితంగా కళ్లు పొడి బారటం, ఎర్రబడటం, కళ్ల మంట, కంటిచూపు, రెటీనా దెబ్బతినే సమస్యలు తలెత్తుతాయి.
కాళ్లు, చేతులు చల్లబడటం..
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాళ్లు, చేతులు నీలిరంగులు మారుతుంటాయి. ఈ లక్షణాన్ని రేనాడ్స్ డిసీజ్ అంటారు. చల్లటి వాతావరణం పడని వారికి చేతులు, కాళ్లల్లో రక్తప్రసరణ తగ్గి రంగు మారుతుంది. రోగనిరోధక వ్యవస్థ మూలంగా థైరాయిడ్ గ్రంథి పనితీరులో వచ్చే మార్పుల కారణంగా చేతులు, కాళ్లు చల్లగా అనిపిస్తాయి.
జీర్ణ సమస్యలు..
కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటివి జీర్ణ సమస్యలుగా పరిగణిస్తారు. కొన్నిసార్లు పెద్దపేగులో పుండ్లు (అల్సరేటివ్ కొలైటిస్), పేగుపూత (క్రాన్స్), గ్లూటెన్ పడకపోవడం, సీలియాక్ వ్యాధి వంటి సమస్యలు తలెత్తుతాయి. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో వచ్చే మార్పుల కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. జట్టు రాలడం, ఎండపడకపోవడం, దెబ్బ తగిలినప్పుడు మానకపోవడం, తరచూ జలుబు, ఫ్లూ వంటి సమస్యలు, శరీరంగా తొందరగా అలసట చెందటం, నీరసంగా అనిపించడం వంటి సమస్యలు.. రోగనిరోధక శక్తి పనితీరులో వచ్చే మార్పుల వల్ల సంభవిస్తాయి.