తేనేతో గుండెపోటు నివారణ సాధ్యమా..?

Join Our Community
follow manalokam on social media

తేనే గురించి తెలియని వారంటూ ఉండరు. తేనేని ఎక్కవగా ఆయుర్వేద వైద్యంలో వాడుతుంటారు. తేనేలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. తేనే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాగే తేనేలో తీపిని ఇచ్చే పదార్థాన్ని ‘ట్రెహలోజ్‌’ అంటారు. అయితే, కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్‌ను ఇంజెక్ట్‌ చేస్తూ నిర్వించిన పరిశోధనలు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయేమోననే అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయట. తేనేలోని టెహ్రలోజ్‌ ఇంజెక్ట్‌ చేసిన ఎలుకల్లోని రక్తనాళాల్లో ‘ప్లాక్‌’ చేరలేదట. దీంతో తేనేను ప్రతి రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు వైద్యులు. ఇది కేవలం ఐదు నిమిషాలలోనే జీర్ణమవుతుంది.

honey

అంతేకాదు.. గతంలో చేరిన ప్లాక్‌లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించింది. అయితే ఈ ట్రెహలోజ్‌ను నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లోనూ లేదా ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్‌ చేసిన మూషికాలలో ఈ విధమైన తగ్గుదల కనిపించలేదు. ప్రస్తుతం కనుగొన్న విషయం భవిష్యత్తులో అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రక్తనాళాల్లోని ప్లాక్‌ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్‌ అనే ఒక రకం ఇమ్యూన్‌ కణాలు చేస్తుంటాయి. వాటిని పుట్టించేందుకు అవసరమైన టీఎఫ్‌ఈబీ అనే ఒక రకమైన ప్రోటీన్‌ ఉత్పాదనకు ట్రెహలోజ్‌ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

దీంతో గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్‌ సహాయంతో రక్తనాళాల్లోని పాచిని తొలగిస్తుంది. తద్వారా గుండెపోటు ముప్పును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఇలా చక్కెరకు బదులు తేనే వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే అంశంపై వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పిల్లలకు దంతాలు వచ్చే సమయంలో తేనెను తినిపించండి.. దీంతో దంతాలు సులభంగా వస్తాయంటున్నారు వైద్యులు. విపరీతమైన దగ్గుతో బాధపడుతుంటే తేనేను అల్లం రసంలో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

TOP STORIES

శ్రీరామనవమి స్పెషల్: పానకం, వడపప్పు ప్రసాదం ఇలా ఈజీగా చేసేయండి…!

శ్రీ రామ నవమి అంటే హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఆ రోజున ఇళ్ళల్లో, దేవాలయాల్లో కూడా శ్రీ రామునికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఉదయాన్నే...