ఈ కుటుంబ సంప్రాదాయం కాస్త విభిన్నం గా ఉంటుంది. వాళ్లు ఎక్కడి కి వెళ్లిన కలిసే వెళ్తారు. అయితే వారు పెళ్లి కో పెరంటానికో కాదు.. దొంగతనానికి. కుటుంబ మొత్తం బరి లోకి దిగి రాత్రి వరకు ఎక్కడో ఒక చోట చోరీ చేసుకుని వస్తారు. తాజా గా ఈ ముఠా ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే 16.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివరాలనిఉ డీసీపీ గజారావు భూపాల్ తెలిపాడు. నగరంలోని మొగల్‌కాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్ , అతడి భార్య జకియా బేగం(43). కూతురు అయేషా సిద్ధిఖీ(19) ఉన్నారు.
వీరి చోరీలు కాస్త భిన్నంగా ఉంటాయి. కూతరు సిద్దికీ చోరీకి అనువైన ఇళ్లను గుర్తింస్తుంది. తండ్రి సలీమ్ కాపాల గా ఉంటాడు. జకియాబేగం ఇంట్లో దొంగతనాలు చేస్తుంది. ఈ ముగ్గురూ కలిసి 2019 నుంచి దొంగతనాలు చేస్తున్నారు. ఎవరైనా నిలదీస్తే అద్దె ఇంటి కోసం వెతుకుతున్నామని చెబుతారు. తలుపులు తీసి ఉండటంతో లోపలకు వచ్చామంటూ వారికి చెబుతారు. ఇటీవల చందూలాల్ బారాదరి, గుల్షన్‌నగర్, ఘాజిబండ తదితర ప్రాంతాల్లో వరుసగా నాలుగు చోరీలు జరిగాయి. దీంతో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా ఈ కుటుంబాన్ని ఆరెస్టు చేశారు.