రామ్ చరణ్ – ఉపాసనల మొదటి కలయిక ఎక్కడ జరిగిందంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఉపాసనను గత పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు..వివాహం జరిగినప్పటి నుంచి వీరిద్దరూ వ్యక్తిగత జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతూ ఆదర్శ దంపతులుగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. వృత్తిపరంగా కూడా ఎవరికి వారు బిజీగా ఉన్నప్పటికీ తమకంటూ కొంత సమయాన్ని కేటాయించుకొని మరీ సంతోషంగా గడుపుతూ ఉన్నారు.

ఈ క్రమంలోనే 10 సంవత్సరాల దాంపత్య జీవితానికి గుర్తుగా త్వరలోనే మరో కొత్త వ్యక్తిని జీవితంలోకి ఆహ్వానించబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఉపాసన డెలివరీకి సిద్ధం అవుతుంది. అమెరికాలోని ప్రముఖ గైనకాలజిస్టు జెన్నీఫర్ ఆస్టన్ ఆధ్వర్యంలో ఉపాసన డెలివరీ కాబోతోంది అని రాంచరణ్ కూడా స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రాంచరణ్ ఉపాసనాల మొదటి కలయిక ఎప్పుడు ఎక్కడ జరిగింది అనే విషయాలను అభిమానులు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు ఇకపోతే రామ్ చరణ్ , ఉపాసన ఇద్దరూ కూడా ఒకే కాలేజీలో చదువుకున్నప్పటికీ కూడా వీరిద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడిందట.

కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరూ మొదటిసారి లండన్ లోని స్పోర్ట్స్ క్లబ్ లో కలసినట్లు తెలుస్తోంది . అక్కడ వీరి పరిచయం ఏర్పడి స్నేహానికి మొదటి అడుగు పడింది . అలా చాలా కాలం తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారి పెద్దలకు చెప్పి మరి పెళ్లి చేసుకున్నారు. అపోలో సంస్ధల అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసన. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ ఏడడుగులు మూడుముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news