అద్దం.. ఇంట్లో ఏ వైపున ఉంచితే మంచిది? ఎటు వైపు ఉంచకూడదు?

-

మీ అందాన్ని చూసుకునే అద్దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచుతున్నారా? ఇంట్లో పెట్టుకునే అద్దం Mirror, ఏ వైపున ఉంచితే బాగుంటుంది? ఎక్కడ ఉంచకూడదు? మొదలగు విషయాలు తెలుసుకోవాలి.

అద్దం /Mirror
అద్దం /Mirror

ముందుగా అద్దం ఆకారం గురించి చూద్దాం. గుడ్డు ఆకారం, గుండ్రంగా ఉన్న అద్దాలను ఇంట్లో ఉంచకండి. వీటిని దురదృష్టానికి ప్రతీకలుగా గుర్తిస్తారు. అందుకే ఇలాంటి ఆకారాలు గల అద్దాలను అవాయిడ్ చేయండి.

స్థానం

మీ ముఖ్య ద్వారానికి ఎదురుగా అద్దాన్ని ఉంచరాదు. దానివల్ల ఇంట్లోని సానుకూల సామర్థ్యం అంతా బయటకి వెళ్ళిపోతుందని భావన.

పడకగదిలో

అద్దం పడకగదికి ప్రత్యేక గుణాన్ని తీసుకువస్తుంది. ఐతే ఇది గుర్తుంచుకోండి. మీరు పడుకునే మంచం, అద్దంలో కనిపించకుండా చూసుకోండి. పడకగదిలో అద్దం స్థానం చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటుంది.

చదువుకునే గదిలో

అద్దం కనిపించగానే ఒక క్షణం ఆగిపోతారు. ఎలా ఉన్నాం అని చూసుకుంటూ ఉంటారు. ప్రతీ ఒక్కరూ ఇలా చేస్తుంటారు. అందుకే చదువుకునే గదిలో అద్దం ఉంచుకోవద్దు. చదువు మీద ధ్యాస తప్పించేందుకు ఇది కారణం అవుతుంది.

పిల్లల గదిలో

పిల్లల గదిలో అద్దాన్ని ఉంచవద్దు. అది వారి అభివృద్ధికి ప్రతిబంధకంగా నిలుస్తుంది. ఎప్పుడైనా సరే అద్దాన్ని పిల్లల గదుల్లో ఉంచకపోవడమే కరెక్టు. ముందే చెప్పినట్టు అద్దం మనసును మారుస్తుంది.

చిన్న చిన్న దారుల్లో

ఇంట్లో ఒక గది నుండి మరో గదుల్లోకి వెళ్ళే చిన్న చిన్న దారుల్లో అద్దాలను ఉంచవద్దు. దీనివల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది. కాబట్టి దారుల్లో అద్దాలను పెట్టే ఆలోచన మానుకోండి.

వ్యతిరేక దిశలో

వ్యతిరేక దిశల్లో అద్దాలను అమర్చవద్దు. నెగెటివ్ ఎనర్జీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఆలోచన కాదు.

కిచెన్ లో

వంట గదుల్లో నీళ్ళు, నిప్పు ఉంటాయి. అలాంటి ప్రకృతి శక్తులు ఉన్నచోట, అద్దాలను అమర్చకపోవడమే మంచిది. రెండింటి శక్తులు ఢీకొట్టుకుని ప్రతికూల శక్తి విడుదలయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news