తెరుచుకున్న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు.. తెలంగాణకు గోదావరి జలాలు

-

మహారాష్ట్రలో ఉన్నటువంటి బాబ్లీ ప్రాజెక్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. ఇరు రాష్ట్రాల జల సంఘం అధికారులు మొత్తం 14 గేట్లకు గాను మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నాలుగు నెలల పాటు.. బాబ్లీ గేట్లను ఎత్తి ఉంచి అక్టోబర్‌ 29న మూసివేయనున్నారు అధికారులు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరుచుకోవడంతో శ్రీరాంసాగర్‌కు గోదావరి జలాలు రానున్నాయి. భారీ వర్షాలు కురిస్తే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు.

కాగా.. బాబ్లీ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1.96 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 0.75 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా.. కృష్ణా జలాల నీటిపై ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ జల వివాదం చిలికి.. చిలికి…గాలి వానలా తయారైంది. అటు ఏపీ, తెలంగాణ నాయకులు ఒకరిపై.. మరొకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.  అంతేకాదు.. ఈ జల వివాదం కాస్త.. విద్యుత్‌ వివాదంగా మారిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news