ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణ రెడ్డిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ విషయంలో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులను చర్చలకు పిలవడానికి సజ్జల ఎవరంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణం రాజు డిమాండ్ చేశారు.
అలాగే పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు విడుదల చేయవద్దనీ ఉద్యోగులు డిమాండ్ చేశారని అన్నారు. అయితే ఉద్యోగులను ఇబ్బంది పెట్టాలని ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలను విడుదల చేసిందని విమర్శించారు. చలో విజయవాడ లో భారీ సంఖ్యలో ఉద్యోగులు వచ్చారని అన్నారు. ఉద్యోగులను చూసి పోలీసులే.. చేతులెత్తేశారని అన్నారు. అలాగే పోలీసులు కూడా ఉద్యోగులే అని వారికీ కూడా సమస్యలు ఉంటాయని అన్నారు.