దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించడం తీవ్ర నిరాశకు గురిచేసిందని సోమవారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ పేర్కొన్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మొట్ట మొదటిసారి దక్షిణాఫ్రికలోనే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ తొలి కేసు వెలుగులోకి రాగానే ప్రపంచానికి తెలియజేసిందుకు దక్షిణాఫ్రికా, బొట్సావానా దేశాలకు అధనమ్ ధన్యవాదాలు తెలిపారు.
కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను వేగంగా గుర్తించి, సీక్వెన్సింగ్ చేసి, నివేదించినందుకు దక్షిణాఫ్రికా, బోట్సావానా దేశాలకు ధన్యవాదాలు. కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చిన దక్షిణాఫ్రికా నుంచి విమానాల రాకపోకలను పలు దేశాలు నిషేధిస్తూ వెళ్తుండటం తీవ్ర నిరాశాకు గురిచేసింది. ఒమిక్రాన్ వేరియంట్‌కు సంబంధించిన సమాచారం ప్రపంచ దేశాలతో పంచుకోవడంలో ప్రదర్శించిన పారదర్శకతకు ఆఫ్రికా దేశాలను గౌరవించాలి అని అదనమ్ సూచించారు.