తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పేసిన చిరు..ఆమంటే..?

-

చిరంజీవి సినీ ప్రయాణంలో ఆయనతో కలిసి నటించిన హీరోయిన్స్ కోకొల్లలు.. ఇటీవల ఆ హీరోయిన్ల గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు చిరంజీవి.. రాధా ,రాధిక, మాధవి, శ్రీదేవి, విజయశాంతి వంటి అగ్ర కథానాయకుల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు.. తాజాగా చిరంజీవి సోనీ లివ్ లో సింగర్ సునీత నిర్వహిస్తున్న నిజం విత్ స్మిత టాక్ షోలో పాల్గొన్నారు చిరంజీవి .. ఈ టాక్ షోలో భాగంగా చిరంజీవి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకోవడం జరిగింది.. ఫిబ్రవరి 10వ తేదీన చిరంజీవి ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయగా.. తన జీవితంలో ఎదురైన చేదు సంఘటనల గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో చిరుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వారి గురించి స్మిత ప్రశ్నించగా.. రాధికా శరత్ కుమార్, విజయశాంతి, రాధ , శ్రీదేవి లాంటి స్టార్ లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి చిరంజీవి నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. తమ మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని అన్నారు. వారిలో ఒక్కొక్కరికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా రాధిక సహజంగా నటించేస్తుందని తెలిపిన చిరంజీవి.. తనతో డాన్స్ చేసే సమయంలో రాధా పర్ఫెక్ట్ అని తన పాత్రలో తనను తాను మార్చుకునే గొప్పతనం విజయశాంతి సొంతమని అన్నారు. ముఖ్యంగా రాధా, విజయశాంతి డాన్స్ పవర్ ఫుల్ గా ఉంటుందని.. అలాగే శ్రీదేవితో గొప్ప వ్యక్తిగత వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని కూడా తెలిపారు చిరంజీవి..

ముఖ్యంగా శ్రీదేవితో పనిచేసిన ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను.. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ ఉత్తమ జంట గానే ఉంటుందని ఆయన తెలిపారు. జగదేకవీరుడు అతిలోకసుందరి, మోసగాడు, ఎస్పీ పరశురామ్ చిత్రాలలో నటించడానికి కారణం ఆమె పైన ఉన్న ఇష్టమే.. ఆమె నటన, డాన్స్ చాలా బెస్ట్ గా ఉంటుంది అంటూ శ్రీదేవి పై ప్రశంసల వర్షం కురిపించారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news