డబ్ల్యూహెచ్‌ఓ: ఎవరూ సేఫ్ గా లేరు

ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరూ సురక్షితంగా లేరు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ (డీజీ) టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ సోమవారం వ్యాఖ్యానించారు. పేద దేశాలకు కరోనావైరస్ వ్యాక్సిన్‌ను న్యాయంగా పంపిణీ చేసేలా తాము చొరవ చేపట్టామని ఆయన అన్నారు. గత వారం ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదు అయిన కేసుల్లో కరోనా యూరప్ లో బాగా కట్టడి అయింది అని చెప్పారు.

ఈ వైరస్ యొక్క మూలాన్ని మేము తెలుసుకోవాలి ఎందుకంటే భవిష్యత్తులో వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇది మాకు సహాయపడుతుంది అని ఆయన వెల్లడించారు. మేము వుహాన్ నుండి అధ్యయనాన్ని ప్రారంభిస్తాము , అక్కడ ఏమి జరిగిందో తెలుసుకుంటామని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి తాము కష్టపడుతున్నామని అన్నారు.