ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్పుడప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన వాస్తవాలను ప్రపంచానికి తెలియచేస్తూ అవగాహనా శక్తిని పెంచుతో ఉంటుంది. అందులో భాగంగా తాజాగా బ్లడ్ ప్రెజర్ గురించి ఒక కీలకమైన సమాచారాన్ని తెలియచేసింది. ముఖ్యంగా ఇండియా లో అధిక రక్తపోటు వలన ఎంతమంది బాధితులుగా మారుతున్నారు మరియు ఎంతమంది మరణిస్తున్నారు అన్న విషయాన్ని తెలియచేసింది. ఈ అధిక రక్తపోటు ఎక్కువగా 30 వయసు నుండి 79 సంవతసరాల వయసు ఉన్న వారికి వస్తుందని తెలుపుతోంది. ఇంకా ఈ వయస్సులలో బీపీ ఉన్న వారి సంఖ్య 188 .3 మిలియన్ ల మందికి ఉన్నట్లు తెలుస్తోంది. మానవాళి అంతా ఈ అధిక రక్తపోటును కనుక నియంత్రించగలిగితే దాదాపుగా ఏటా 4 .6 మిలియన్ మంది మరణాలను తగ్గించవచ్చని తెలుస్తోంది.
ఈ అధిక రక్తపోటు వలన .. గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ లాంటి అకాల మరణాలకు దారి తీస్తోందన్నారు. ఇక ఇండియాలో ఏకంగా 52 శాతం మంది గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.