మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంపీలు వీరే !

-

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్లమెంట్ లో ఈ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టడం జరిగింది. ఇక దేశంలో మహిళల కోసం తీసుకు వచ్చిన బిల్లు కావడంతో అందరూ ఏకపక్షముగానే బిల్లుకు ఆమోదాన్ని తెలపాలి. కానీ బిల్లును ప్రవేశ పెట్టగా కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఈ బిల్లుకు వ్యతిరేకతను తెలపడం చాలా మందిని ఆశ్చర్యపరచడమే కాకుండా షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఈ రోజు పార్లమెంట్ కు మొత్తం 456 ఎంపీలు హాజరవ్వగా వారిలో బిల్లుకు మద్దతుగా 454 మంది మాత్రమే ఓటు వేయడం జరిగింది. కానీ పార్లమెంట్ లో మొత్తం 545 మంది ఎంపీలు ఉండగా వారిలో 111 మంది గైర్హాజరయ్యారు. అయితే ఈ బిల్లుకు వ్యతిరేకంగా వెస్ట్ వేసిన ఇద్దరు ఎంపీలు కూడా ఎం ఐ ఎం పార్టీకి చెందినవారే కావడం గమనార్హం.

వారిలో ఒకరు తెలంగాణ హైద్రాబాద్ కు ఎంపీ అసదుద్దీన్ ఒవైసి కాగా మరొకరు ఇంతియాజ్ జలీల్ (ఔరానాగాబాద్/ఛత్రపతి శంభాజీనగర్) లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news