ఆనందాన్ని ఎవరు కోరుకుంటున్నారు..? అయితే ఈ టీ తాగేయండి.!!

-

తలనొప్పికి చాయ్‌ తాగడం తెలుసు.. ఇక బరువు తగ్గడానికి కూడా ఏవేవో హెర్బల్‌ టీలు ఉన్నాయి.. కానీ హ్యాపీగా ఉండటానికి కోసమే.. స్పెషల్‌గా ఒక చాయ్‌ ఉంది తెలుసా..? ఈ టీ తాగితే.. హ్యాపీగా ఉంటారట.. ఆనందాన్ని కోరుకుంటున్నారా..? అయినా ఎవరు కోరుకోరు చెప్పండి..! ఇంతకీ ఈ టీ ఏంటో, అది ఎలా చేస్తారో.. ఇది ఎలా హ్యాపీగా ఉంచుతుందో చూద్దామా..!
గన్ మై డా జావో టాంగ్ (Gan Mai Da Zao Tang) దీనినే ఆనందకరమైన టీ అని కూడా పిలుస్తారు..ఈ పేరేంటో తేడాగా ఉందే అనుకోకండి.. గన్ మై డా జావో అంటే చైనా భాషలో ఆనందం. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు ఈ టీ తాగితే డిప్రెషన్ పోయి మంచి మూడ్‌లోకి వస్తామట. మళ్లీ అందరితో ఆనందంగా మాట్లాడతామట. అందుకే దీనికి హ్యాపీనెస్ టీ అని పేరు వచ్చింది. ఈ టీ చేసుకోవడం చాలా సింపుల్. హ్యాపీనెస్ టీ రెసిపీ ఈ కింద ఉంది చూడండి.

హ్యాపీ టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

లికోరైస్ 9 గ్రాములు
గోధుమలు 9 గ్రాములు
ఎర్ర ఖర్జూరం 10 గ్రాములు

హ్యాపీనెస్ టీ తయారు చేసే విధానం..

ముందుగా నీటిని వేడి చేసి, ఆ వేడి నీటిలో పైన చెప్పిన మూడు పదార్థాలు వేయండి.. బాగా మరిగించండి..మరిగించాక.. నీటిని వడకట్టి ఒక కప్పులోకి పోసుకుంటే హ్యాపీ టీ రెడీ. గోరువెచ్చగా తాగితే ఆందోళన పోయి, ఆనందం కలుగుతుందట. హ్యాపీనెస్ టీకి కావలసిన పదార్థాలు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.. లీకోరైస్‌ అంటే అతిమధరం.. ఇది సర్జికల్‌ షాపుల్లో కూడా దొరుకుతుంది.. కుదిరితే ఒకసారి ట్రై చేయండి.. హ్యాపీగా ఉండండి.. హ్యాపీగా ఉండాలంటే.. మన మూడ్‌ బాగుండాలి..అది చుట్టు ఉన్న మనుషులు, పరిస్థితులన్ని బట్టి వస్తుంది అనొచ్చు.. కానీ మనం తినే పదార్థాల వల్ల కూడా మనం హ్యాపీగా ఉంటాం.. బాడీలో కొన్ని హ్యాపీ హార్మోన్స్‌ ఉంటాయి.. అవి రిలీజ్‌ అయినప్పుడు మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news