ఆదివారం రాగానే హౌస్ నుండి ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఏడుగురు సభ్యుల్లో నుండి అవినాష్ ఇంటికి వెళ్ళాడు. ఈ విషయాన్ని అందరూ ముందుగానే ఊహించారు. నిజానికి గత వారమే ఎలిమినేట్ అవ్వాల్సిన అవినాష్, బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రీ ఎవిక్షన్ పాస్ వల్ల మరో వారం పాటు ఉండగలిగాడు. వారం తర్వాత అంతా అనుకున్నట్టే జరిగింది. మోనాల్, అవినాష్ ల మధ్య ఎలిమినేషన్ కి జరిగిన గట్టి పోటీలో అవినాష్ హౌస్ నుండి బయటకి వచ్చేసాడు.
ఐతే హౌస్ నుండి బయటకి వచ్చిన అవినాష్, స్టేజి మీదకి వచ్చాక అందర్నీ నవ్వించాడు. జోకర్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన అవినాష్, అందర్నీ నవ్విస్తూ, హౌస్ లో పరిస్థితుల వల్ల కోపం తెచ్చుకుంటూ, ఎక్కువశాతం హౌస్ లో ఎంటర్ టైన్ చేస్తూ, ఎంటర్ టైనర్ ఆఫ్ ద హౌస్ గా నిలిచాడు. కొన్ని సందర్భాల్లో అవినాష్ కామెడీపై సీరియస్ అయినప్పటికీ, హౌస్ లో కామెడీ చేసి ఎంటర్ టైన్ చేసింది ఒక్క అవినాష్ మాత్రమే.
హౌస్ లో చేసినట్టుగానే స్టేజి మీద కూడా అందర్నీ ఇమిటేట్ చేస్తూ కడుపుబ్బా నవ్వించాడు. ముఖ్యంగా మోనాల్, హారిక లని ఇమిటేట్ చేసినపుడు అందరూ నవ్వారు. ఆరియానా మాత్రం అవినాష్ హౌస్ నుండి వెళ్ళిపోవడంతో కొద్దిగా ఎమోషనల్ అయ్యింది.వారిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. సాధారణంగా హౌస్ లో ఏదైనా ఫేవర్ చేయాలంటే అది ఆరియానా కోసం ఖచ్చితంగా చేసే అవినాష్, ఎలిమినేట్ అయ్యాక స్టేజి మీద మాత్రం అభిజిత్ కి ఫేవర్ గా చేసాడు.
ఈ వారం మొత్తం ఏ పనీ చేయకుండా ఉండాలి అనే బిగ్ బాంబుని అభిజిత్ కి ఇచ్చాడు. అందరూ ఆరియానాకి ఇస్తారని ఊహించినప్పటికీ అవినాష్, అది అభిజిత్ కి ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. మరి తన ఫ్రెండ్ అయిన ఆరియానాని పక్కన పెట్టి అభిజిత్ కి ఇవ్వడానికి కారణం ఏంటనేది ఆసక్తిగా ఉంది. బిగ్ బాస్ షో చివరి వరకు వచ్చిన ఈ తరుణంలో ఆరియానాని పక్కన ఎందుకు పెట్టాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మరి ఈ విషయంలో అవినాష్ ఏం చెప్తాడో చూడాలి.