అట్లతద్ది నోము ఎందుకు చేసుకోవాలి.. తప్పకుండా వీటిని ఎందుకు పాటించాలి..?

-

పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయిన స్త్రీలు కూడా అట్లతద్ది నోమును జరుపుకుంటూ ఉంటారు. పెళ్లి కాని వాళ్లు అట్లతద్ది నోము నోచుకుంటే మంచి భర్త వస్తారు అని అంటారు. పెళ్ళయిన స్త్రీలు అట్లతద్ది నోము నోచుకుంటే ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చని.. సంపద కలుగుతుందని అంటారు.

అట్లతద్దినాడు స్త్రీలు గోరింటాకు పెట్టుకుని.. ఉయ్యాల ఊగుతారు. ఆటలు ఆడుకుంటారు. తెల్లవారకముందే భోజనం చేసేస్తారు. తరవాత రాత్రి వరకు ఉపవాసం వుంటారు. రాత్రి చంద్రుడికి పూజ చేసి అట్లని నైవేద్యంగా పెట్టి ముత్తైదువుకు అట్లను ఇచ్చి తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ రోజంతా కూడా ఉపవాసం ఉంటారు.

ఈ ఏడాది అట్లతద్ది ఎప్పుడు..?

ఈ ఏడాది అట్లతద్ది అక్టోబర్ 12న వచ్చింది. ఆశ్వయుజ బహుళ తదియ నాడు అనగా రేపు అట్లతద్ది నోముని చేస్తారు. అట్లతద్ది నాడు ఎంతో సందడిగా ఉంటుంది. ”అట్ల తద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పోయ్ మూడట్లోయ్” అని పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ సందడి చేస్తారు.

అట్లతద్ది నోము ఎందుకు చేసుకోవాలి..?

పతి దేవుని కోసం స్త్రీలు ఈ నోమును నోచుకుంటారు. సాయంకాలం చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే భుజిస్తారు. పతి దేవుడి కోసం పతి దేవుని ఆరోగ్యం కోసం ఈ నోముని నోచుకోవడం జరుగుతుంది.

ఈ నోముకి ఎంత ప్రత్యేకమో తెలుసా..?

పరమశివుడు ఈ వ్రతం గురించి తన భార్య అయిన పార్వతీ దేవికి చెబుతాడు. అలానే అర్జునుడు పాశుపతాస్త్రం సాధించడం కోసం వెళ్తే పాండవుల కష్టాలను ఎదుర్కొంటారు. అప్పుడు ద్రౌపదితో శ్రీ కృష్ణ భగవానుడు ఈ వ్రతం చేయమని చెప్తాడు. ఈ ప్రయత్నం చేయడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు ద్రౌపది తో చెప్పాడు. ఇంత ప్రత్యేకం వుంది అట్ల తద్దికి.

Read more RELATED
Recommended to you

Latest news