హోటల్ రూమ్స్ లో తెల్లటి బెడ్ షీట్స్ ని ఎందుకు వేస్తారు..?

-

ఎప్పుడైనా హోటల్లో స్టే చేసినప్పుడు గమనిస్తే మంచాల పైన తెల్లటి బెడ్ షీట్లు ఉంటాయి. నిజానికి తెల్లటి బెడ్ షీట్స్ ని ఉతుక్కోవడం కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు హోటల్స్ లో మంచాల పైన వైట్ బెడ్ షీట్స్ నే వేస్తారు..? నిజానికి చాలా చోట్ల ఇదే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే మరి ఎందుకు ఈ బెడ్షీట్స్ నే వేస్తారు దీని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

 

నిజానికి తెల్లటి బెడ్ షీట్స్ ని ఉపయోగించడం వల్ల ఏమవుతుందంటే ప్రశాంతత కలుగుతుంది. తెలుపురంగు శాంతికి చిహ్నం. పైగా తెల్లటి రంగు చూస్తే ఎంతో ప్రశాంతత మనలో కలుగుతుంది. ఎలాంటి డిస్టబెన్స్ ఉన్నా సరే వెంటనే మన నుండి దూరం అవుతుంది. హాయిగా ఉండేలా మార్చేస్తుంది తెలుపు రంగు.
తెలుపు రంగు పర్యావరణాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. అందుకే వైట్ కలర్ ని వాడతారు.
అలానే పరోక్షంగా బెడ్ షీట్ లతో మేము మా పర్యావరణాన్ని అందంగా ఉంచుతాము అని చెప్పడానికి సంకేతం.
అదే విధంగా తెలుపురంగు స్వచ్ఛతను సూచిస్తుంది. పైగా తెల్లటి రంగు ని వాడడం వల్ల కలర్ పోవడం లాంటి సమస్యలు ఉండవు. రోజు తెల్లగానే ఉంటుంది.
రోజు వాటిని ఉతికిన సరే రంగు వెలిసిపోదు. ఇందు మూలంగానే హోటల్స్ లో తెల్లటి రంగు బెడ్ షీట్స్ ని ఉపయోగిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news